![]() |
![]() |

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. మళ్ళీ పెళ్లి పేరుతో ఆల్రెడీ పెళ్ళైన జంటల్ని తీసుకొచ్చి వాళ్లకు టాస్కులు పెట్టి ఫుల్ జోష్ క్రియేట్ చేశారు. ఇక ఈ షోకి అమ్మ రాజశేఖర్-రాధ ఇద్దరూ వచ్చేసరికి "మొదటిసారి ఇద్దరూ కలిసి చూసిన సినిమా ఏమిటి" అని అడిగింది రష్మీ కానీ రాజశేఖర్ ఆన్సర్ చెప్పకపోయేసరికి మిర్చి తినక తప్పలేదు.
తర్వాత నవీన్, బబిత ఇద్దరూ స్టేజి మీదకు వచ్చారు. "మీరు ఇద్దరూ ఆర్టిస్టులు కాబట్టి ఇద్దరూ కలిసి చేసిన సినిమా ఏమిటి" అని రష్మీ అడిగేసరికి "ప్రేమించేది ఎందుకమ్మా అనే మూవీ చేస్తున్నప్పుడు అక్కడే బబితను చూసాను ప్రేమించాను, అక్కడే పెళ్లి చేసుకున్న, అక్కడే షూటింగ్ చేశా."అని ఆన్సర్ కరెక్ట్ చెప్పినా బబిత మాత్రం తనను ఎక్కువ సేపు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నవీన్ తో మిర్చి తినిపించింది.
ఇక తర్వాత దొరబాబు-అమూల్య ఇద్దరూ స్టేజి మీదకు వచ్చారు .."మీ ఇద్దరిలో ముందు ముద్దు ఎవరు పెట్టారు" అని రష్మీ అడిగేసరికి "అరేయ్ ఎప్పుడో విషయం గురించి కాదురా.. మన ఇద్దరి గురించిరా" అంటూ అమూల్య ఫుల్ స్పీడ్ ఐపోయింది. వెంటనే దొరబాబు "నేనే ముద్దుపెట్టుకున్న ముందు అప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్ ఎల్లో - రెడ్" అని కరెక్ట్ గా చెప్పాడు. కానీ ఇంద్రజ ఆ ఆన్సర్ రాంగ్ అని చెప్పు అంటూ అమూల్యతో అబద్దం చెప్పించేసరికి దొరబాబు మిర్చి తినక తప్పలేదు. ఇలా కొంటె టాస్కులు ఇచ్చి రష్మీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది.
![]() |
![]() |